![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ ఇప్పుడు అత్యధిక టీఆర్పీ తో నెంబర్ స్థానంలో కొనసాగుతుంది. ఈ సీరియల్ లోని కనకం-కృష్ణమూర్తిల కుటుంబం ఒక మధ్యతరగతి కుంటుంబం. ఇందులో స్వప్న, కనకం ఆశలు గాల్లో ఉండగా.. కావ్య, కృష్ణమూర్తి ల ఆలోచనలు బాగుండాలి.. నిజాయితీగా ఉండాలి.. ఎవరిని నొప్పించకూడదనే విధంగా ఉంటాయి. అయితే ఈ ఫ్యామిలోని కావ్య, అప్పు, స్వప్న అందరికీ సుపరిచితమే. కావ్య అలియాస్ దీపిక రంగరాజు ఇప్పుడు ప్రతీ కుటుంబంలో ఒక అమ్మాయిలా మారిపోయింది. ప్రతిరోజూ దీపిక రంగరాజు తన ఇన్ స్టాగ్రామ్ లో 'బ్రహ్మముడి' సీరియల్ కి సంబంధించిన వివరాలను షేర్ చేస్తుంటుంది.
దీపిక రంగరాజు తన పేరుతో ఒక యూట్యూబ్ ఛానెల్ ని మొదలుపెట్టింది. ఆ ఛానెల్ లో తన మొదటి వీడియోని 'బ్రహ్మముడి' సీరియల్ లో నా జర్నీ అలా మొదలైంది అంటూ ఆ వీడియోకి టైటిల్ ని పెట్టేసి.. అందులో 'బ్రహ్మముడి' సీరియల్ కి సంబంధించిన నటీనటులను పరిచయం చేసిన కావ్య, ఆ తర్వాత చీరల షాపింగ్ వెళ్ళినప్పుడు ఒక వ్లాగ్, కొడైకెనాల్ కి వెళ్ళినప్పుడు ఒక వ్లాగ్ ఇలా ప్రతీది తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంటుంది కావ్య.
బ్రహ్మముడి సీరియల్ లో కావ్య,రాజ్ ల జోడీకి ఎంత క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. అయితే కావ్య సంప్రదాయబద్ధంగా చీరలు కడుతూ ప్రతీ తెలుగింటి ఆడపడుచులా కనిపిస్తుంది. దాంతో ఈ సీరియల్ ని ఆసక్తికరంగా చూస్తున్నారు. అయుతే తాజాగా దీపిక తన యూట్యూబ్ ఛానెల్ లో ఒక వీడీయోని అప్లోడ్ చేసింది. తన సిస్టర్ బర్త్ డేకి సర్ ప్రైజ్ గిఫ్ట్ కోసం ఒక జ్యువెలరీ షాప్ కి వెళ్ళిన కావ్య.. అక్కడ తన సిస్టర్ కోసం ఒక జ్యువలరీ తీసుకోగా, తనకోసం రెండు తీసుకున్నట్టు వీడీయోలో చెప్పింది కావ్య. షాపింగ్ పూర్తయ్యాక తన సబ్ స్కైబర్స్, ఫాలోవర్స్ కి కొన్ని టిప్స్ కూడా ఇచ్చింది కావ్య.
![]() |
![]() |